Praja Kshetram
తెలంగాణ

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇ

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే

 

హైదరాబాద్ డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సినీ ప్రముఖుల ఇంటిపై దాడిని ఖండిస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంటిపై కొందరు వ్యక్తులు చేసిన దాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దేశంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని రాష్ట్ర డిజిపిని ఆదేశించారు.ట్విట్టర్ లో “సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.” తెలిపారు.

సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను.

శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు.

Related posts