Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సోషియేషన్ సంగారెడ్డి అధ్యక్షునిగా 

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సోషియేషన్ సంగారెడ్డి అధ్యక్షునిగా

 

-కొండాపూర్ మండల డిప్యూటీ తాసిల్దార్ మర్రి ప్రదీప్.

కొండాపూర్ డిసెంబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు ఆఫీస్ సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఓకే వేదిగా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సోషియేషన్ సమావేశం సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రతీ రెవెన్యూ ఉద్యోగి యొక్క సంక్షేమమే పరమావధిగా లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళబోతున్నామన్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సోషియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన కొండాపూర్ డిప్యూటి తహశీల్దార్ మర్రి ప్రదీప్ ని మండల రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతీ రెవెన్యూ ఉద్యోగి సంక్షేమం కోసం పని చేస్తానని, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం’ రైతుల సమస్యలకు సంజీవినిలా పని చేయగలదని పేర్కొ న్నారు. గ్రామస్థాయిలి రెవెన్యూ అధికారులను తిరిగి నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణి యమని, రైతులకు ఉపయోగకరమన్నారు.రెవెన్యూ ఉద్యోగులంతా ఐక్యంగా పనిచేసి ఇటు రైతులు అటు ప్రభుత్వానికి అనుసంధానుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కష్టపడి పనిచేస్తామని సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గిర్దావరి మహాదేవ్, ఆంజనేయులు రమేష్,అనంతయ్య రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts