జగ్గారెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ కేకుల పంపిణీ
కొండాపూర్ డిసెంబర్ 24(ప్రజాక్షేత్రం):కొండాపూర్ మండల గ్రామాలలో క్రిస్టమస్ పండుగ సందర్భంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మంగళవారం ప్రతి చర్చికి కేకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్, కాంగ్రెస్ నాయకులు అనిల్, మామిడిపల్లి అనిల్, తలారి రాజు తదితరులు గ్రామాల్లో తిరిగి కేకులు పంపిణీ చేశారు.