Praja Kshetram
తెలంగాణ

అనుమతులు లేకుండానే అక్రమంగా 50 ఎకరాల్లో చెట్లను నరికివేత

అనుమతులు లేకుండానే అక్రమంగా 50 ఎకరాల్లో చెట్లను నరికివేత

 

-స్థానికుల సమాచారంతో ఆడుకున్న ఫారెస్ట్ అధికారి

కొండాపూర్ డిసెంబర్ 24(ప్రజాక్షేత్రం):వృక్షో రక్షితి రక్షిత అంటారు పెద్దలు కానీ రోజురోజుకు ఎలాంటి అనుమతులు లేకుండా 50 నుండి వందల ఎకరాల్లో చెట్లను నరికేశారు. వివరాల్లోకెళ్తే మండల పరిధిలోని మనసానిపల్లి గ్రామ సర్వేనెంబర్ 222, 150 తదితర సర్వే నెంబర్లలో దాదాపు 50 నుండి 100 ఎకరాల్లో ఫారెస్ట్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే కడప రవాణా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుండి జరుగుతుంది. గ్రామ స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం ఫారెస్ట్ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా నరికిన చెట్లను లారీ వాహనం నెంబర్ ఏ.పీ 29 టిబి8537 వాహనంలో అర్థ రాత్రుల్లో (వేప,నమిలినేర,తుమ్మ)తదితర చెట్లను నరికినట్లు పరిశీలించి నరికేసిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని విచారణ తర్వాత పూర్తి విచారణ చేసి పెనాల్టీ వేయడం జరుగుతుందని సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి ఒక ప్రకటన తెలియజేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లు నరికినట్లయితే ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెనాల్టీ ఎంత వేశారో పూర్తి వివరణ రావాల్సి ఉంది.

Related posts