సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ
వికారాబాద్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కే గంగ నాయక్ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా రిలే దీక్షలు చేస్తున్న సందర్భాన్ని ఉద్దేశిస్తూ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ మద్దతు ప్రకటిస్తూ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కెసిఆర్ మాట్లాడుతూ మనసులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడమేంది. విచిత్రంగా ఔట్సోర్సింగ్ ఏంది వింతగా అని కల్లిబొల్లి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కాంట్రాక్టు పద్ధతి ఔట్సోర్సింగ్ పద్ధతి ఇలాంటి ఏ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అందరిని కూడా రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్, ఈ తెలంగాణ రాష్ట్రం అవతరించినాక ఏ ఒక్క శాఖకు సంబంధించిన సమస్యను తీర్చకుండా ఆయన పాలను నియంతృత్వ పాలనతో, ఒక రాజు లాగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి అత్యంత దయనీయ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను వెనుకకు నెట్టి వేయడం జరిగింది. అందుకు ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని అధికారంలోకి రాకుండా యావత్ తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా ఓట్లు వేసి గెలిపిస్తే అప్పుడు కెసిఆర్ అధికారంలోకి రాకంటే ముందు ఏ విధంగా అయితే హామీలు ఇవ్వడం జరిగిందో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఈ సమగ్రస్ శిక్ష ఉద్యోగులకు హామీ ఇచ్చి మరి అధికారంలోకి వచ్చాక ఒక సంవత్సర కాలం గడిచినను వల్ల సమస్యలపై కనీసం అక్కడ వాళ్ళ సిబ్బందిని కూడా పంపించకుండా పట్టించుకోకుండా చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోపం వస్తే ఏ విధంగా అయితే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా బొంద పెట్టే అవకాశం వచ్చిందో అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టే సమయం పెద్ద దూరం లేదని ఇకనైనా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేనిపక్షంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ కి ఈ సమస్యను వివరించి ఉద్యమానికి మద్దతిచ్చి ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.