Praja Kshetram
తెలంగాణ

చలికాలంలో చిరుజల్లులు.

చలికాలంలో చిరుజల్లులు.

 

-ఆగం ఆగం అవుతున్న రైతన్నలు

పెద్దేముల్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):శీతాకాలంలో చిరుజల్లులతో పెద్దేముల్ మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుండి చిరుజల్లులతో ముసురు వర్షం కురిసింది. కురిసిన వర్షంతో పనులకు ఆటంకం కలిగించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చలితో కూడిన చిరుజల్లులు కురవడంతో, జనాలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు.

అకాల వర్షం రైతన్న ఆగం.

అకాల వర్షంతో రైతన్నలు ఆగం ఆగం అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు వర్షం ఆటంకం కలిగించింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా కంది, పత్తి, వరి తదితర పంటలు చేతికొచ్చిన సందర్భంలోనే ఇలా చిరుజల్లులు కురవడంతో పంట నాశనం అవుతుందేమోనని బిక్కు బిక్కుమంటున్నారు.

Related posts