10 లక్షల రూపాయలు దొంగలించిన నిందితులు అరెస్టు
-సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్న పోలీసులు
-వాణిజ్య సముదాయల దగ్గర వ్యాపారస్తులు సీసీ కెమెరాలు చేసుకోవాలి
-సంగారెడ్డి డి.ఎస్.పి సత్తయ్య
కొండాపూర్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవేపక్కన వున్నా తాజ్ ధాబా వద్ద 10 లక్షల రూపాయలు దొంగలించిన నిందితులను అరెస్టు చేసి గురువారం రిమాండ్ కు తరలించారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి దొంగతనాలు చేసిన ఆధునిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకున్నమన్నారు. ఫ్లాట్ కొనుగోలు చేయడానికి అబ్దుల్ వాజీద్ 10 లక్షల రూపాయలు తన కారులో సమకూర్చుకున్నారు. ఈనెల 16-12-2024 వ తేదీన పాటు కొనుగోలు చేయడానికి ఫిర్యాది అబ్దుల్ వాజిద్ అతని స్నేహితులు కలిసి హైదరాబాద్ నుండి బసవ కళ్యాణ్ వెళ్ళుటకు రెడ్ కలర్ బీజ కార్ లో వెళుతూ మార్గమధ్యలో మునిపల్లి మండలంలోని తాజ్ దాబా హెూటల్ వద్ద భోజనం చేయుటకు ఆగగా ఎవరో గుర్తు తెలియని దొంగలు కారులో ఉన్న పది లక్షల రూపాయలను దొంగలు తీసుకోపోయినారని పోలీస్ స్టేషన్ లో అబ్దుల్ వాజీద్ పిర్యాదు మేరకు ఈ కేసులో కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్, మునిపల్లి ఎస్సై ఎం రాజేష్ నాయక్ అతని సిబ్బందితో సీసీ కెమెరాలు తనిఖీ చేసి దొంగలను గుర్తించినారు, అందులో మహ్మద్ అలీ ఖురేషి, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ రహీం ఖాన్అ అలియాస్ ఆదిల్ లు ఓల్డ్ సిటీ, హైదరాబాద్ గా గుర్తించి వారిని పట్టుకుని విచారించి , బుదేరా తాజ్ రెస్టారెంట్ వద్ద చేసమని నేరం ను ఒప్పుకున్నారని విలేకరుల సమావేశంలో తెలిపారు. దొంగలించిన, 10,00,000/- నగదును కొండాపూర్ సిఐ డి వెంకటేష్, సి చేసి నేరస్తులను రిమాండ్పై తరలించారు.