నేర్మట నుండి శేరిగూడెం లింకురోడ్డును బాగు చేయండి
-సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
-గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలి
చండూర్ డిసెంబర్ 26(ప్రజాక్షేత్రం):నేర్మట నుండి శేరిగూడెం రోడ్డు బాగు చేయాలని, తక్షణమే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారంసిపిఎం నాయకులు, గ్రామస్తులతో కలిసి ఈరోడ్డుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేర్మట నుండిశేరిగూడెం రోడ్డు బాగు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ రోడ్డు వెంట 200 కుటుంబాల రైతులకుఈ రోడ్డు అవసరమని,ఈ రోడ్డు అద్వానంగా తయారు కావడంతో ఈ దారి వెంట నడవాలంటే బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ గ్రామానికిచుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, లెంకలపల్లి, శేరిగూడెం, గొల్లగూడెం గ్రామాలకు లింకు రోడ్లు లేకపోవడంతోప్రజలు,రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా వేరే ప్రాంతాల నుండి వచ్చిన పాదాచారులకు కూడా ఈ లింకు రోడ్లు బాగు చేయకపోవడంతో ఈ దారి వెంట నడవాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. తక్షణమేరాష్ట్ర రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి, ఈ రోడ్లను బాగు చేయాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. లేనియెడల గ్రామ ప్రజలందరినీ ఏకం చేసి ఈ రోడ్డు బాగు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బొమ్మరగొని యాదయ్య, గుయ్యని పండు, గ్రామ ప్రజలుఈరటి శ్రీశైలం, రాములు, లక్ష్మయ్య, ఈరటి యాదయ్య, సైదులు, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.