మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన జ్యోతి భీమ్ భరత్
శంకర్ పల్లి డిసెంబర్ 26 (ప్రజాక్షేత్రం):మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీజ్యోతి భీమ్ భరత్ మాట్లాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థిక మంత్రిగా ప్రధానిగా, పదవులకే వన్నెతెచ్చిన గొప్ప రాజకీయ నేత మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.