వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో తినుబండారాలపై అధిక రేటు
-వికారాబాద్ ఆర్టిసి బస్టాండ్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలు విక్రయిస్తున్నారు.
వికారాబాద్ డిసెంబర్ 27(ప్రజాక్షేత్రం):జిల్లాలోని ప్రధాన బస్టాండ్లలో తినుబండారాల నీటి బాటిల్ ప్రయాణికులు అడిగిన కంపెనీ ఇవ్వకుండా వేరే బ్రాండ్ అమ్ముతున్నారు. నాసిరకమైన కంపెనీ బ్రాండ్ లేకుండా విక్రయిస్తున్నారు. ఫై 20 రూపాయలు ధర ఉంటే 25 నుంచి 30 రూపాయలు విక్రయిస్తున్నారు. వ్యాపారాలు అధిక ధరకు ప్రయాణికుల జేబుకు చిల్లి పెడుతున్నారు. ఎమ్మార్పీ రేట్లకు అమ్మడం లేదని ప్రణీకులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నిఘవేయాలని ప్రజలు అంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకొని వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్లు ఇతరతులు తిను బండారాలు అధిక ధరలకు అమ్ముతున్నారు ఎమ్మార్పీ కంటే ఐదు రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. తిను బండరాలుపై తయారు చేసిన తేదీ వేయకుండానే విక్రయిస్తున్నారు. గట్టిగా నిలదీసి అడుగుతే ఇష్టముంటే తీసుకో లేదంటే బయట తీసుకోపో అని ప్రయాణికులకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వివిధ గ్రామాల నుంచి వస్తున్న ప్రయాణికులకు సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.