Praja Kshetram
తెలంగాణ

పది రోజులుగా కదలని చెత్త బండి

పది రోజులుగా కదలని చెత్త బండి

 

-శంకర్ పల్లి మండలం సంకేపల్లి లో ఆగిన చెత్త సేకరణ

-పట్టించుకోని సెక్రటరీ నరహరి

శంకర్ పల్లి డిసెంబర్ 27(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సంకేపల్లి లో గత వారం, పది రోజుల నుంచి చెత్త సేకరణ ఆగిపోయింది. చెత్త సేకరణ నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటి ముందర చెత్త పుట్టగా ఏర్పడడంతో చెత్తను ఎక్కడ వేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. చెత్త వల్ల రోగాలు వస్తాయి అని భయాందోళనకు గురి అవుతున్నారు దీనిపై సిబ్బందిని వివరణ అడగక ట్రాక్టర్ చెడిపోయింది అని బాగు చేయడానికి సెక్రటరీ కానీ, అధికారులు కానీ ఎలాంటి చొరవ చూపడం లేదు అని, ఊరి సమస్య గమనించి మాజీ ఎంపిటిసి మేఘన సంజీవరెడ్డి ట్రాక్టర్ ని బాగు చేశారు. అని అన్నారు. అయితే ట్రాక్టర్ గ్రామపంచాయతీ వద్ద నిలపడం తో చుట్టుపక్కవారు చెత్తని ఏం చేయాలో తెలియక నిలుచున్న డాక్టర్ లో చెత్త వేసి వెళ్లారు. దానివల్ల చుట్టుపక్కల వారికి దుర్గంధం వస్తుంది. అని ఈగలు, దోమలు ఇంట్లోకి వస్తున్నాయి అని చుట్టుపక్కల వారు వాపోతున్నారు.

Related posts