శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో అమెరికా దేశస్థుడు ప్రత్యేక పూజలు
శంకర్ పల్లి డిసెంబర్ 31(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం అమెరికా దేశస్థుడు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు ప్రమోద్ ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయకమిటీ సభ్యులు ఆయనను స్వామి వారి శేషవస్త్రంతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో అనుభూతినిచ్చిందన్నారు.