Praja Kshetram
తెలంగాణ

రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు.. ఎన్నికలకు ముందే!?

రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలు.. ఎన్నికలకు ముందే!?

 

హైదరాబాద్ డిసెంబర్ 31(ప్రజాక్షేత్రం):పంచాయతీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో మరో 200 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జీపీల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీరాజ్​ శాఖకు వినతులు వచ్చినట్లు సమాచారం.

పాత జీపీలతో కలిపి ఎన్నికలు..

ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా కొత్త జీపీలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త జీపీల ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పంచాయతీరాజ్​ శాఖకు వినతులు పంపించగా.. వీటిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త గ్రామ పంచాయితీలకు ఏర్పాటుకు ఓకే చెప్పనున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక ఆర్డినెన్స్​ ద్వారా ఉత్తర్వులు జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాతవాటితో పాటే కొత్త జీపీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతులకు అందించే పెట్టుబడి సాయంలో టెక్నాలజీని ఉపయోగించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా రైతుల నుంచి దరఖాస్తులు సేకరించడంతోపాటు ప్రత్యేక వెబ్‌సైట్​లేదా యాప్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్​సబ్‌కమిటీ సమావేశమవగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు కీలక సూచనలు చేశారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనుండగా సీఎం రేవంత్​రెడ్డి సూచించిన విధివిధానాలను కార్యరూపం దాల్చేందుకు కేబినెట్​సబ్‌కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Related posts