మరకత శివుడికి (హైదరాబాద్) అబిడ్స్ కమర్షియల్ టాక్స్ జోనల్ కమిషనర్ నవనీత రెడ్డి పూజలు
శంకర్‌పల్లి జనవరి 01(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివుడికి (హైదరాబాద్) అబిడ్స్ కమర్షియల్ టాక్స్ జోనల్ కమిషనర్ నవనీత రెడ్డి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రమోద్ ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు, కమిషనర్ ను స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కమిషనర్ మాట్లాడుతూ మరకత శివుడుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, ప్రముఖ వైద్యురాలు డా. అంజనీ రెడ్డి, కమిటీ సభ్యులు ఉన్నారు.