అనారోగ్యంతో నారాయణ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ మమత మృతి
శంకర్ పల్లి జనవరి 01(ప్రజాక్షేత్రం):మున్సిపల్ పరిధి నారాయణ టాలెంట్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ మమత (30) అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమత మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతాపం వ్యక్తం చేశారు. మమత అంతిమయాత్రలో పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. చదువు నేర్పిన టీచర్ మరణించడంతో విద్యార్థులు శోకసముద్రంలో మునిగిపోయారు.