ఫిబ్రవరి 7న జరగబోయే లక్ష డప్పులు వెయ్యి గొంతులు మహా ప్రదర్శన విజయవంతం చేయండి
-ఎంఎస్పీ జాతీయ నాయకులు మద్దిలేటి మాదిగ
వికారాబాద్ జనవరి 01(ప్రజాక్షేత్రం):స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రమైన వికారాబాద్ పట్టణంలో క్లబ్లో మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు మద్దిలేటి మాదిగ మరియు ఆత్మీయ అతిథులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టగళ్ళ ప్రశాంత్ మాదిగలు హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 7న జరగబోయే వేయి గొంతులు లక్ష డప్పులచే మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లాలోని మాదిగ మాదిగ ఉపకులాలు మరియు కళాకారులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి అడ్డుపడుతున్న దుష్టశక్తులను తిప్పి కొట్టి వారి గుండెలదిరే విధంగా ప్రతి ఒక్కరూ డబ్బుతో హైదరాబాదును ముట్టడి చేసి దండోరా మోగించాలని పిలుపునివ్వడం జరిగింది.
అంతేకాకుండా నిత్యం కండువాలు మార్చే సంపన్న వర్గం అయినటువంటి వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్లు ఆయన ఆర్థిక పలుకుబడితో వర్గీకరణ ఆపే ప్రయత్నం చేస్తున్న విషయం యావత్ సమాజం గమనిస్తున్న విషయమే… అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వెనుకబడ్డ వర్గాలకు అన్నిటికీ సామాజిక న్యాయమని పేరుతో ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్లు షెడ్యూల్డ్ కులాలలో అందరికీ అందట్లేవని అవి అందరికీ అందే విధంగా పంచాలని ఈ దేశంలో ఎన్నో కమిషన్లు నివేదికలను భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ శ్రీ మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని సుదీర్ఘ ఉద్యమం చేస్తూ మాదిగ మాదిగ ఉపకులాలకు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పంచాలనే డిమాండ్తో పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి సాక్షాత్తు సుప్రీంకోర్టు కనికరించి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అంశం అయిందని అవి రాష్ట్రాలు పంచాలని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. అంతటితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా దేశంలో అందరికంటే ముందుగానే ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు చేసి అవసరం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ లలోనే అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని అమలుకాకుండా అడ్డుపడుతున్న నేతలే సంపన్న వర్గం అయినటువంటి మాలలు అంటే ఏ విధంగా వాళ్ళ పలుకుబడి ఉందో యావత్ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే యావత్ సమాజం మద్దతు ఇచ్చే మాదిగ మాదిగ ఉప కులాలు లక్ష డప్పులచే వేయి గొంతుకలో తో హైదరాబాద్ లో జరగబోయే మహా ప్రదర్శనలు విజయవంతం చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ ఎంఎస్పి కార్యదర్శిలు డప్పు మహేందర్ మరియు కృష్ణ ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి మల్కప్ప జగదీష్ బంటారం మండల ఇన్చార్జి భరత్, మండల సీనియర్ నాయకులు అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.