శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వరుడి సేవలో మోకిల సీఐ వీరబాబు గౌడ్
శంకర్ పల్లి జనవరి 01(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వరుడి ఆలయంలో బుధవారం మోకిల సీఐ వీరబాబు గౌడ్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయిశివ సిఐ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు సిఐని స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. సీఐ మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజున శివాలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.