Praja Kshetram
తెలంగాణ

సర్కార్ బడులోనే సక్కనైన చదువు

సర్కార్ బడులోనే సక్కనైన చదువు

 

-ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ తరగతులు

-ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే అన్నారు

-విద్యార్థులకు టై, బెల్ట్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నవాబ్ పేట్ జనవరి 02(ప్రజాక్షేత్రం):నవపేట్ మండలంలో పులుమామిడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో చేవెళ్ల శాసనసభ్యులు కలే యాదయ్య పని చేస్తానని ఆయన అన్నారు. మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేసి, డిజిటల్ తరగతి గదులను మరియు ప్రొజెక్టర్ తరగతి గదులను ప్రారంభించి విద్యార్థులంచే నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం విద్యార్థులని విద్యార్థులకు బెల్ట్, టైళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి అద్భుతమైన డిజిటల్ క్లాసులను వినియోగించుకోవాలి అన్ని రంగాల్లో ముందుండాలి రానున్న ముందు రోజుల్లో ఉన్నతమైన శిఖరాలకు మీరు చేరుకోవాలని కోరుకుంటున్నానని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వారికి మంచి పేరు తీసుకువచ్చేలాగున మీరు చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆయన వాళ్లకు సూచించారు. అక్కడ ఉన్న పాఠశాల బృందానికి కూడా ఆయన హెచ్చరించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాలని ఆయన వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts