ఇస్తేమా పనులను పరిశీలించిన జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు
శంకర్ పల్లి జనవరి 02(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి లో 4,5 తేదీలలో నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు, మెడికల్ అధికారులతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ అధికారులు, మత పెద్దలు సమన్వయంతో పని చేస్తూ ఇస్తేమ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ నాగేంద్రబాబు, డా. రేవతి ఉన్నారు.