Praja Kshetram
తెలంగాణ

మా గ్రామాన్ని పెద్దేముల్ మండలంలోనే కొనసాగించాలి

మా గ్రామాన్ని పెద్దేముల్ మండలంలోనే కొనసాగించాలి

 

– తాండూరు సబ్ కలెక్టర్ కు నర్సాపూర్ గ్రామస్తుల వినతి

పెద్దేముల్ డిసెంబర్ 30(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం నుంచి మా గ్రామాన్ని విడదీయోద్దని.. పెద్దేముల్ మండలంలోనే కొనసాగించాలని తాండూర్ సబ్ కలెక్టర్ కు గురువారం నర్సాపూర్ గ్రామ యువకులు వినతిపత్రం అందజేశారు. ఇటీవల తట్టెపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తట్టెపల్లిలో నర్సాపూర్ గ్రామాన్ని విలీనం చేస్తున్నారని తెలిసి గ్రామస్తులు కలెక్టర్ తో వారి సమస్యలను తెలిపార.తట్టెపల్లీకి నర్సాపూర్ గ్రామానికి మద్య 12 కిలోమీటర్ల దూరం ఉంటుందని తెలిపారు. మండల కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు ఆటో, బస్సు సౌకర్యం కూడా ఉండదని వివరించారు. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావల్సి వస్తుంది అని తెలిపారు. అదే పెద్దేముల్ కేవలం 5 కిలోమీటర్లు అవుతుందని, గ్రామ ప్రజలు వెళ్లేందుకు వీలుగా వుంటుంది అని తెలిపారు. గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామాన్ని పెద్దెముల్ మండలం లోనే కొనసాగించాలని, తట్టెపల్లిలో కలపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

Related posts