Praja Kshetram
తెలంగాణ

నవాబ్ పేట్ స్ ఐ అరుణ్ కుమార్ గౌడ్ కి ఎందుకు అంత అహంకారం?

నవాబ్ పేట్ స్ ఐ అరుణ్ కుమార్ గౌడ్ కి ఎందుకు అంత అహంకారం?

 

-చట్టం ఎవరికి చుట్టం కాదు

-న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలలి

-ఎవరి అండ చూసుకొని బెదిరింపులు

-ఫ్రెండ్లీ పోలీస్ అంటే రక్షణ కోసం వచ్చిన బాధితులను ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడంమా?

-అఖిల భారత రైతు కూలీ సంఘం (ఎఐకెఎమ్ఎస్) జిల్లా అధ్యక్షులు వై మహేందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ఆధ్వర్యంలో డి.ఎస్.పి కి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ

నవాబ్ పేట, జనవరి05 (ప్రజాక్షేత్రం):నవాబ్ పేట మండల్ మాదారం గ్రామానికి చెందిన ఒక మహిళ కొనుక్కున్న భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమకు అమ్మలంటూ ఒత్తిడి చేస్తూ అమ్మకుంటే మీ అంతు చూస్తామని బెదిరిస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఆమె కొనుక్కున్న భూమిలో బోర్ ఉండడం చేత దానికి కూడా అదనంగా డబ్బులు కట్టించి ఒప్పంద కాగితాలు రాసుకోవడం జరిగింది. అయినా కానీ భూమి మీకు అమ్మ లేదు అంటూ కొంతమంది వ్యక్తులు ఆమెను బెదిరించి భూమిలో బోరు ఎత్తుకుపోయారు ఆ మహిళ యొక్క తల్లిని పొలంలో పనులు చేస్తుండగా కొట్టిన సందర్భంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా ఆ మహిళతో నీకు కబ్జా ఎవడు ఇచ్చిండు వాని తీసుకురా లేకుంటే నీ అంతూ చూస్తాను అని బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం జరిగింది. ఇట్టి విషయం పై ఎస్సై తన బాధ వినట్లేదని సీఐ నీ కలిసి చెప్పడం జరిగింది సిఐ వద్ద పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో మహిళను సతాయిస్తున్న వ్యక్తులు మళ్లీ పొలంలో టాక్టర్ వేసి ప్రయత్నం చేయగా ఇట్టి విషయంపై తిరిగి మళ్లీ ఎస్ఐకి కాంప్లిట్ ఇవ్వగా మీరే తెలివి ఉన్నోళ్లు అనుకుంటున్నారా పై అధికారుల దగ్గరికి పోయేటంత బలుపు ఉందా మీకు ఏమనుకుంటున్నారు అని తిట్టడం ఏమాత్రం సరికాదు. ఇట్టి విషయంలో నేడు ఐదవ తారీకు రావాలని చెప్పగా తనకు న్యాయం చేస్తారు ఎస్ఐ అనే ఉద్దేశం తో వెళ్లిన మహిళకు చేసేది ఏం లేదు నీ దిక్కున చోట చెప్పుకపో ఎక్కువ కథలు పడితే కేసు పెట్టి లోపల వేస్తా ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తూ రియల్ వ్యాపారులకు పొలిటికల్ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మద్దతునిస్తూ మహిళను కించపరిచేలా మాట్లాడుతూ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడిన ఎస్సై పైన చర్య తీసుకోవాలని డి.ఎస్.పి కి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇలాంటి పోలీస్ అధికారులు ఉంటే ఎంత ఊడితే ఎంత

ప్రజలకు రక్షణ కల్పించమని ప్రభుత్వం పోలీసులను పెట్టండి సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎన్నో జరిగాయని నవపేట్ మండలంలో ఉన్నటువంటి ప్రజలు తెలుపుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు ఇంకెన్నో సందర్భాలలో ఇలానే మాట్లాడుతారు అని వాళ్ళ తెలిపారు. వారిపై ఎటువంటి చరువ తీసుకోవట్లేదు అంటే రాజకీయం చేస్తున్నటువంటి మిస్సయిపై ఇంకెవరు యాక్షన్ తీసుకుంటారు. చట్టం ఎవరికి చుట్టం కాదు.. అది ఒక అధికారి అయిన ప్రజలు అయిన ఒకటి ఇటువంటి పరిస్థితి నవపేట్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ పై తక్షణమే చొరవ తీసుకోవాలని తీసుకోవాలి.

Related posts