డిప్యూటీ తాహసిల్దార్(డిటి)ను నియమించేది ఎప్పుడూ..!
-నాలుగు నెలలు గడుస్తున్నా మండలానికి డిటీ కరువు.
-డిమాండ్ చేస్తున్న మండల ప్రజలు
పెద్దేముల్ జనవరి 5(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ ను ఎప్పుడు నియమిస్తారో నని మండల ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. గత నాలుగు నెలల క్రితం పెద్దేముల్ మండల డిప్యూటీ తాహసిల్దారుగా విధులు నిర్వర్తించిన మహేష్ కుమార్.. కోట్ పల్లి మండలానికి బదిలీపై వెళ్లారు. అప్పటినుండి ఇప్పటి వరకు సుమారు నాలుగు నెలలు గడుస్తున్న నూతన డిటీని నియమించలేరు. దీంతో చిన్న సమస్య ఉన్న తహసిల్దార్ ని సంప్రదించాల్సి వస్తుందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కులము, ఆదాయము, నివాస ధ్రువీకరణ సర్టిఫికెట్లతో పాటు వ్యవసాయ భూములకు సంబంధించిన పలు సమస్యలు పెండింగ్లో పడుతున్నాయని మండల ప్రజలు వాపోతున్నరు. ప్రభుత్వం స్పందించి నూతన డీటీని నియమించి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.