Praja Kshetram
తెలంగాణ

ప్రజా నాయకుడు కేటీఆర్  

ప్రజా నాయకుడు కేటీఆర్

 

వనపర్తి జనవరి 05(ప్రజాక్షేత్రం):ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమలు కాని హామీలపై గట్టిగా నిలదీస్తున్న కేటీఆర్ ప్రజా నాయకుడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డిలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేటీఆర్ నేతృత్వంలో రాబోయే రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక అవినీతి నిర్బంధ పాలనను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ అదే సమయంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ పార్టీని కొత్త పుంతలు తొక్కిస్తున్న కేటీఆర్ నాయకత్వం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Related posts