పసి ప్రాణాన్ని బలి తీసుకుని వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్
-ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతికి కారణమైన డాక్టర్ అశోక్ లైసెన్స్ రద్దు చేయాలి
-ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి వై గీత
నవాబ్ పేట, జనవరి 06(ప్రజాక్షేత్రం):వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి ఒంటిగంట సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని డాక్టర్ కు తెలియజేశాము డాక్టర్ అప్పుడే స్పందిస్తే బాబు బతుకుతుండే కానీ వస్తున్న అని కాలయాపన చేసి ఎంత సేపటికి రాకపోవడంతో బాబు మృతి చెందడాని మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న w/o బిక్షపతి బాబు తల్లిదండ్రుల రోదనకు కారణమైన డాక్టర్ను సస్పెండ్ చేయాలి. రాత్రిపూట పోతే అటెండర్ తప్ప డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉండరు ఉన్న సిస్టర్ ల తోటే ట్రీట్మెంట్ చేపిస్తారు ఏదైనా అత్యవసరమైతే హైదరాబాద్ పొండి అని చేతులు దులుపుకోవడం తప్పిస్తే కనీస ట్రీట్మెంట్ కూడా చేయకుండా తప్పించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే నరకయాతన తలపిస్తున్న వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు ఎన్ని సంఘటనలు జరిగినా మారడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలి.
