సర్కారు డాక్టర్ల నిర్లక్ష్యంతో పసికందు మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
-వికారాబాద్ సర్కారు దావకానలో చిన్న పసికాడును కాపాడలేని వైద్యులు ఎందుకు?
-డాక్టర్ అశోక్ కి నిధుల నుంచి తొలగించాలి
-శిశువు చనిపోయిన తర్వాత వైద్యం చేస్తున్నానని నాటకం
-డిఎంహెచ్వో ఈ ఘటనపై స్పందించాలని శిశువు మృతి తండ్రి బిక్షపతి కోరారు
నవాబ్ పేట, జనవరి06(ప్రజాక్షేత్రం):డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పుట్టిన నాలుగు రోజుల పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు నవపేట్ మండలం మాదిరెడ్డిపల్లి గ్రామం బిక్షపతి స్వప్న లకు పుట్టిన బాబు. బాబు పుట్టారని ఎంతో సంతోషంతో వాళ్లు వ్యక్తపరిచారు నా సంతోషం లేకుండా చేసినటువంటి వికారాబాద్ జిల్లా వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ అశోక్ వాళ్ళని మా బిడ్డ చనిపోయాడని వాళ్ళు దిక్కున మొర పెడుతున్నారు.
అసలు బాబుకు ఏం జరిగింది
బాబు పుట్టి నాలుగు రోజులు అయింది. సడన్గా నిన్న రాత్రి అనగా ఆదివారం సుమారు 12 గంటలకు బాబుకి ఎక్కిళ్లు రావడంతో బిక్షపతి స్వప్నా దీంతో వెంటనే గమనించిన బాలింత స్వప్న బిక్షపతి కుటుంబ సభ్యులు వికారాబాద్ లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి హాస్పిటల్లోని చిన్న పిల్లల వార్డుకు తరలించారు. అక్కడ డాక్టర్లు ఉన్న పట్టించుకోకుండా ఎన్ని ఫోన్లు చేసినా తీయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ హాస్పటల్ . వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ అశోక్ మృతికి కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు సరైన సమయానికి లేకపోవడం,రాకపోవడం వల్లనే, విధులలో నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్లో ఆందోళనకు దిగారు. తండ్రి ఆవేదన అర్ధరాత్రి అయినా కుక్కను దింపించినట్టు తిప్పించారు ఆఖరికి వస్తే నా కుమారుడుని చంపేశారని బాధ వ్యక్తం చేశారు. వికారాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో ఈ విషయం చోటు చేసుకుంది కావున ఈ పరిస్థితిని పై అధికారులు గమనించి డిఎంహెచ్వో డాక్టర్ అశోక్ ఎదురునుంచి తొలగించాలని కుటుంబ సభ్యులు ప్రజాసంఘాలు ఆందోళనకు దిగారు. అగ్రహించిన బంధువులు , స్నేహితులు, కుటుంబ సభ్యులు సుమారు రెండు గంటల సేపు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఆందోళన నిర్వహించారు. మృతునికి కారణమైనటువంటి డాక్టర్ అశోక్ నిధుల నుంచి తొలగించాలని అక్కడ ఉన్న వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం జరిగేలా చేయాలని వాళ్లు కోరారు.
తల్లిదండ్రులు బిక్షపతి స్వప్న ఆవేదన
రెండు రోజుల క్రితం ఏరియా ఆసుపత్రిలో స్వప్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ ఎక్కువగా ఏడిచే దాన్ని ఎంత చెప్పినా సిబ్బంది రాకపోవడంతో నా బిడ్డ మృతి చెందాడని స్వప్న బిక్షపతి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మూడు హాస్పిటల్లో తిరిగాను అటువంటి స్పష్టత లేని వైద్యులు రెండు ఏం లాభం?.. ప్రభుత్వ హాస్పిటల్లో నన్ను ఎట్టుపడితే అట్టు తింటారు కానీ నా బిడ్డను బ్రతికించలేదు కేవలం ఇది డాక్టర్ అశోక్ నిర్లక్ష్యం వల్లనే. శిశువు చనిపోయిన తర్వాత డాక్టర్ అశోక్ వచ్చి నేను వైద్యం చేస్తున్నానని నటిస్తున్నాడు అని వాళ్ళు తెలిపారు. ఎన్ని ఫోన్ కాల్స్ చేసిన రెస్పాన్స్ అవ్వని డాక్టర్ వచ్చిన తర్వాత నా రూమ్ దగ్గరికి తీసుకురావచ్చు కదా అని ఆయన అన్నాడని వాళ్ళు తెలిపారు ఇది ఎంతవరకు కరెక్ట్ . డాక్టర్ ప్రభుత్వ హాస్పిటల్లో డ్యూటీ చేయకుండా ఇంట్లో పడుకుంటే ఇలా? డాక్టర్ అశోక్ పై ముందు కూడా ఎన్నో దర్యాప్తులు ఉన్నాయని అక్కడున్న ప్రజలు తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం ఆల్రెడీ నా బాబు చనిపోయాడని తగిన చర్య తీసుకోవాలని మా కుటుంబానికి న్యాయం కల్పించేలా మాకు అండగా నిలవాలని పోలీసులను ఆశ్రయించారు.అర్ధరాత్రి ఎక్కువగా ఏడవడంతో డాక్టర్ కి ఎంత చెప్పినా పట్టించుకోకపోవడంతో బాబు మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ఈ ఘటనపై తప్పకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.