సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ని కలిసిన మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ జనవరి 06(ప్రజాక్షేత్రం):ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక కార్యక్రమమైన వేల గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన జయప్రదం చేయడంలో భాగంగా అన్ని వర్గాల శ్రేణుల మద్దతును కూడబెట్టడం కోసం సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రజాస్వామిక వాది, దళిత, పీడిత ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి , సామాజిక న్యాయాన్ని కోరుకునే వ్యక్తి, ఎన్నో ఉత్తమమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ ని హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మార్యదపూర్వకంగా కలవడం జరిగింది. ఫిబ్రవరి 7న జరగబోయే వేల గొంతుల పాటలు లక్షల డప్పుల మాదిగల గుండె చప్పుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారిని ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేంద్ర మాదిగ అలాగే శంభుక అవార్డు గ్రహీత నలిగింటి శరత్ మరొక ప్రముఖ గేయ రచయిత మచ్చ దేవేందర్ యువ రచయిత గాయకుడు పాటమ్మ రాంబాబు పాల్గొన్నారు.