ఏసీబీ వలలో తొర్రూరు ఇన్‌స్పెక్టర్
హైదరాబాద్ జనవరి 06(ప్రజాక్షేత్రం):మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్‌పెక్టర్ కె. జగదీశ్‌ను లంచం డిమాండ్ చేసినందుకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. జగదీశ్‌పై నేరారోపణ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 2వ తేదీన ఫిర్యాదుదారుని అధికారికంగా ఆదుకునేందుకు రూ.4 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రత్యేకంగా దంతాలపల్లి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఒక కేసులో ఫిర్యాదుదారుని అరెస్టు చేయవద్దని, అతనికి 35(3) BNSS నోటీసు జారీ చేయాలని ఆదేశించాడు. తొలుత జగదీష్ లంచంలో భాగంగా రూ.2 లక్షలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వరంగల్ జిల్లా ఏసీబీ ప్రత్యేక కోర్టులో జగదీష్‌ను హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు అధికారులు తెలిపారు.