ప్రజాక్షేత్రం దినపత్రిక ఎఫెక్ట్
మ-ఫారెస్ట్ అధికారుల అనుబదిలేకుండానే చెట్లను నరికివేత
-20వేల జరిమాన వేసిన ఆగని దళారులు
-సార్లతో మాట్లాడం మీకు చెప్పలేదా అంటున్న దళారరు
కొండాపూర్ జనవరి 06(ప్రజాక్షేత్రం):అనుమతులు లేకుండానే చెట్లను నరికి వేస్తున్నారు అనే కథనం డిసెంబర్ 4, 6 తేదీలో ప్రజాక్షేత్రం దినపత్రిక లో ప్రచురించిన కథనంపై సంగారెడ్డి ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకొని అనుమతు లేకుండా చెట్లను నరుకుతున్న వారిపై 20 వేల రూపాయలు జరిమాన విధించి ఇకపై అనుమతులు లేకుండా చెట్ల నరికినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
మమ్మల్ని ఎవరేం చేయలేరు మేము సార్లతో మాట్లాడుకున్నాం
మండల పరిధిలోని మనసాన్పల్లి గ్రామ 150 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములో ముబారక్పూర్ గ్రామానికి వెళుతుండగా సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేప చెట్లను నరుకుతున్న విషయం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి వదకు చేరుకొని అక్కడ అనుమతి లేకుండా చెట్లను నరుకుతున్న వారిని అడగగా మేము సార్లతో మాట్లాడుకున్నాము ఆ విషయం మీకు చెప్పలేదా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము సార్ వాళ్లకు కలుస్తాం. అని అన్నారు.
ఫారెస్ట్ అధికారి వివరణ
పత్రికలో వచ్చిన సమాచారం మేరకు దర్యాప్ చేసి 20 వేల రూపాయలు జరిమానా విధించాము. ఇకపై సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా మాకు అనుమతి లేదు చెట్లు నరకము అని తెలిపారు అన్నారు. నిర్లక్ష్యం వహించి తిరిగి నరికిన వారిపై మంగళవారం విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నరు.