Praja Kshetram
తెలంగాణ

తెలంగాణలో కొత్త ఓటరు జాబితాను విడుదల..

తెలంగాణలో కొత్త ఓటరు జాబితాను విడుదల..

 

 

హైదరాబాద్ జనవరి 06(ప్రజాక్షేత్రం):తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది పురుష ఓటర్లు… 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది… 85 సంవత్సరాల పైబడిన వారు 2,22,091 మంది ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 3,591… ప్రత్యేక ప్రతిభావంతులు 5,26,993 మంది ఉన్నారు. ఇక శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.

Related posts