Praja Kshetram
తెలంగాణ

పేరుకే కింగ్స్ దాబా… ఫుడ్ నాణ్యతలో పూర్తిగా డొల్ల

పేరుకే కింగ్స్ దాబా… ఫుడ్ నాణ్యతలో పూర్తిగా డొల్ల

దిశ, సంగారెడ్డి అర్బన్ జనవరి 07(ప్రజాక్షేత్రం):కంది జాతీయ రహదారిపై ఉన్న కింగ్స్ దాబా పేరుకే పెద్ద దాబాగా మారిపోయింది. ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత పాటించడం లేనట్లు తేలింది. హైవేపై ఉన్న రెండు బ్రాంచుల్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో దాబాలో కుళ్లిపోయిన పన్నీరు, చికెన్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే చికెన్ బిర్యాని ఇతర వంటకాల్లో హానికరమైన ఫుడ్ కలర్ ను వాడుతున్నట్లు గుర్తించామని, ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారిని అమృత వివరించారు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు రెండు దాబాలకు నోటీసులు కూడా అందజేశారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని ప్రజలకు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

Related posts