విద్యార్థి ప్రాణం తీసిన రిసార్ట్
-వైల్డ్ వాటర్స్ రిసార్ట్ లో ప్రమాదం
-భద్రత లేని రిసార్ట్ యాజమాన్యం
శంకర్ పల్లి జనవరి 09(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి శివారులో గురువారం మద్యానం అందాజ 2 గంటల ప్రాంతంలో వైల్డ్ వాటర్స్ రిసార్ట్ లో జరిగిన ఘటనలో సదరు స్కూలు యాజమాన్యం పైన మరియు వైల్డ్ వాటర్స్ యాజమానయం పైన శంకర్ పల్లి పోలీసులుకేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ పాత బస్తీలోని శాలిబండ ఏరియా లోని “మదీనా మిషన్ హై స్కూల్” కి సంబందించిన 60 మంది విద్యార్థులు మరియు టీచర్లు కలిసి వైల్డ్ వాటర్స్ రిసార్ట్స్ కి ఏక్షకర్షన్ కొరకై వచ్చారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో స్కూలుకి సంబందించిన ఎవరు కూడా వాళ్ళతో పాటు ఉండకపోవటం మరియు రిసార్ట్ యాజమాన్యం కనీస భద్రత చర్యలు తీసకోకపోవటం వల్ల ప్రమాద వశాత్తూ ఫైజన్ అన్సారీ అనే 6 వ తరగతి విద్యార్థి స్విమ్మింగ్ పూల్ లో పడి ప్రమాద వశాత్తూ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తమై ఆసుపత్రి కి తరలిస్తున్న మార్గ మద్యంలోనే ఆ విద్యార్థి చనిపోయినాడు. అయితే మృతుని తండ్రి గులాం రసూల్ అన్సారీ యొక్క ఫిర్యాదు మేరకు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకొని సదరు స్కూలు యాజమాన్యం పైన మరియు వైల్డ్ వాటర్స్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శంకరపల్లి ఇన్స్పెక్టర్ తెలిపారు.
