Praja Kshetram
తెలంగాణ

కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ మేమే చేశాం అంటున్న కాంగ్రెస్

కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ మేమే చేశాం అంటున్న కాంగ్రెస్

 

-బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులన్నీ మేమే చేసాం అంటున్న కాంగ్రెస్ నాయకులు సిగ్గుచేటు అంటున్న బిఆర్ఎస్ నాయకులు

-పలు శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాలు గత ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యాయి

-బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్

-కార్మిక విభాగం చైర్మన్ పులుమామిడి నారాయణ

చేవెళ్ల, జనవరి09 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం. ఈ సందర్భంగా చేవెళ్ల బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు పెద్దల ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో సంవత్సరకాలం అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వాళ్ళు ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాకు కలెక్టరేట్ ఆఫీస్ కట్టించారు, రంగారెడ్డి జిల్లాకు కలెక్టరేట్ ఆఫీస్ కట్టించారు అది టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి , అదేవిధంగా అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నేషనల్ హైవే గత ప్రభుత్వమే శాంక్షన్ చేసిందని ఈ సందర్భంలో వారు తెలిపారు. అదే మాదిరిగా ముడిమాల నుంచి మేడిపల్లి వరకు గత ప్రభుత్వమే పోయిన 2023లో పదో నెల 24 కోట్లతోటి శాంక్షన్ చేయించిన గత ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిన్న జరిగినటువంటి చేవెళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులన్నీ మేమే చేశామంటూ అబద్ధపు మాటలు చెప్పి చేవెళ్ల ప్రజలను మభ్యపెడుతున్నారు మోసం చేస్తున్నారు అని వాళ్ళు ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ ఇవన్నీ మేమే చేశామంటూ ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఈ సందర్భంలో తెలిపారు. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి సేవలలో గ్రంథాలయం ఏర్పాటుకు తూతూ మంత్రంగా వచ్చి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసినట్లు నటిస్తున్నారు కానీ ఆ గ్రంథాలయం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడే సాంక్షన్ అయ్యిందని తెలిపారు. చేవెళ్ల అభివృద్ధి చేసింది అంటే అది గత ప్రభుత్వం మాత్రమే కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి అబద్ధపు మాటలు చెబుతారు వాళ్ళ నాయకులు కూడా అటువంటి ప్రజలను మభ్యపెట్టి మాటలను ప్రజలను మోసం చేసేటటువంటి మాటలను వాళ్లకు చెప్పి మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

కార్మిక విభాగం ఛైర్మెన్ నారాయణ

కెసిఆర్ ప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాలో కలెక్టరేట్ రోడ్లు కానీ పలు అభివృద్ధి పనులు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగాయని ఈ సందర్భంలో తెలిపారు నిన్న గడ్డం ప్రసాద్ ఒక సభాపతిగా ఉండి అలా మాట్లాడడం విడ్డూరం అని ఆ మాటలను టిఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది అని ఈ సందర్భంలో తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పరిగి మండలంలో శిలాపూర్ , మన్నెగూడ, కొడంగల్ ప్రతి అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఎన్నో ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో మంది చనిపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ సభాపతి అదే మార్గంలో వస్తూ పోతూ ఉంటారు మీ కంటికి ఆ రోడ్లు కనిపించలేదా మరణాలు చూడలేదా గత ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శించే హక్కు మీకు లేదు. గత ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలందరికీ తెలుసు ప్రజలు గమనిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని విమర్శలు విడ్డూరమని ఈ సందర్భంలో వారు తెలిపారు అదే విధంగా గడ్డం ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు సరికాదని వాళ్ళు ఈ సందర్భంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు , అబ్దుల్ గాని,విఘ్నేష్ గౌడ్, ఖనాపురం సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,తోట శేఖర్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts