ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాపై రెవెన్యూ అధికారుల మౌనం ఎందుకు?
-ప్రభుత్వ,అసైన్డ్ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు లేదా?
కొండాపూర్, జనవరి 10(ప్రజాక్షేత్రం):గత నాలుగు ఐదు నెలల నుండి కొండాపూర్ మండల వివిధ దినపత్రికలో అసైన్డ్ భూముల కబ్జాపై వార్తలు ప్రచురించినా.. రెవెన్యూ అధికారులు మాకేం సంబంధం లేనట్టు మౌనం పాటిస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు, నాళాలు కబ్జా, నక్ష బాటలు కబ్జా, ప్రభుత్వ భూములు పట్టాగా మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్న, అసైన్డ్ భూముల్లో వెంచర్లు చేస్తున్న ఆధారాలతో సహా దినపత్రికలలో వార్తలు ప్రచురిస్తే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మనసాన్పల్లి, మాందాపూర్, శివన్న గూడెం, గ్రామ ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాట్లు చేస్తున్న రెవెన్యూ అధికారులు మండల స్థాయి నుండి జిల్లా అధికారులకు తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అసైన్డ్ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉండగా దానికి విరుద్ధంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు.