Praja Kshetram
తెలంగాణ

ప్రింట్​ డిజిటల్ రంగాల్లో ‘ప్రజాక్షేత్రం’ ప్రభంజనం

ప్రింట్​ డిజిటల్ రంగాల్లో ‘ప్రజాక్షేత్రం’ ప్రభంజనం

 

-ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించాలి

-అనతి కాలంలోనే ప్రజల్లోకి చేరువైన పత్రిక ప్రజాక్షేత్రం

-క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ జనవరి 11(ప్రజాక్షేత్రం):తెలుగు పత్రికా రంగంలో ‘ప్రజాక్షేత్రం’ఒక సంచలనం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాక్షేత్రం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ మీడియా వేగంతో, ప్రింట్ మీడియా విశ్వసనీయతతో ఎప్పటి వార్తలు అప్పుడే అందించడం ప్రజాక్షేత్రం ప్రత్యేకత అన్నారు. వార్తలను అత్యంత వేగంగా అందిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ‘ప్రజాక్షేత్రం’ డిజిటల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని ప్రశంసించారు. పాఠకులకు తాజా వార్తలు అందించాలనే లక్ష్యంతో ‘ప్రజాక్షేత్రం’పరిచయం డిజిటల్ ఎడిషన్స్ మీడియా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయని, ఇదే విధానాన్ని ఇతర సంస్థలు అనుసరించడం సక్సెస్ కు నిదర్శనంగా చెప్పారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా ఉంటూ అనేక సమస్యలను కథనాల రూపంలో ప్రచురిస్తూ.. అధికారులు నాయకుల దృష్టికి తీసుకు వస్తున్న ప్రజాక్షేత్రం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజలకు, పాఠకులకు, యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాక్షేత్రం దినపత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కూమార్, నల్లన్న, స్టేట్ ఇంచార్జ్ రవీందర్, స్టేట్ కోఆర్డినేటర్ శేఖర్, గోపాల్,నరేష్,కొమ్ము శేఖర్, పాల్గొన్నారు.

Related posts