కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నాయకులు
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కే ఎల్ ఆర్
మహేశ్వరం, జనవరి 11(ప్రజాక్షేత్రం):మహేశ్వరం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఇవాళ మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం నుంచి బీజేపీ నాయకులు పెద్దసంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు.వీరందరికీ మూడురంగుల కండువాలు కప్పి పార్టీలోకి కేఎల్ఆర్ ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.నాల్గో పట్టణంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రపంచ స్థాయి అగ్రశేణి విద్యాసంస్థలను తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహాగౌడ్ జి.శ్రీను, కొమరయ్య సహా కొత్తగా పార్టీలో చేరిన చిట్టె మల్లేష్, వెంకటేష్,బాలరాజు,శ్రీను, రాఘవేందర్,గణేష్, మహేందర్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.