ప్రజల పక్షాన నిలబడేదే ప్రజాక్షేత్రం
-క్యాలెండర్ ఆవిష్కరించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
-డిజిటల్ మీడియాలో వేగం ముఖ్యం.
-ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించాలి.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడి.
పెద్దేముల్ జనవరి 11(ప్రజాక్షేత్రం):ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడే పత్రిక ప్రజాక్షేత్రమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూర్ గౌతమి మోడల్ స్కూల్ లో2025 సంవత్సర ప్రజాక్షేత్రం క్యాలెండర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ మీడియాలో వేగం అనేది ప్రధానమైందని ఆయన సూచించారు. నిత్యం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం నికార్సైన వార్తలను ప్రచురించాలని స్పష్టం చేశారు. పత్రికా అనేది ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తగా వ్యవహరించాలని వెల్లడించారు. అతి తక్కువ కాలంలోనే ప్రజా ఆదరణ పొందుతున్న పత్రిక ప్రజాక్షేత్రమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజాక్షేత్రం ప్రతినిధులు గోపాల్, రవీందర్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి దారాసింగ్, తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, తట్టేపల్లి సొసైటీ చైర్మన్ లక్ష్మారెడ్డి,కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ ఎస్ నారాయణరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభారాణి, తట్టేపల్లి సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం, తాండూర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు నరసింహులు,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహిపాల్ రెడ్డి, మంబాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మైఫూస్, ప్రభాకర్ గౌడ్, సోమ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.