Praja Kshetram
తెలంగాణ

అందరూ చూస్తుండగా అమాంతం గాల్లోకి ఎగిరిపోయిన మెట్రో రైలు

అందరూ చూస్తుండగా అమాంతం గాల్లోకి ఎగిరిపోయిన మెట్రో రైలు

 

హైదరాబాద్ జనవరి 13(ప్రజాక్షేత్రం):మకర సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో మైట్రో రైలు గాల్లో తేలింది. అందరూ చూస్తుండగా అమాంతం ఎగిరిపోయింది. గాలిపటం రూపంలో ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్ ఘనంగా సాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ని ర్వహించారు. ఈ ఫెస్టిల్‌లో నగర వాసులు భారీగా పాల్గొన్నారు. చిత్ర విచిత్ర రూపాల్లో గాలి పటాలను ఎగరవేశారు.

ఆకట్టుకున్న మెట్రో రైలు పతంగి

మెట్రో రైలు పతంగి మాత్రం అందరినీ ఆకర్షించింది. అనుకోనుండా చూసిన చూపరులకు నిజమైన మెట్రో గాల్లో ఉంది ఏంటని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాహ్.. వాటే కైట్ అంటూ కితాబులిచ్చారు. మరోవైపు వివిధ రూపాల్లోని పతంగులు సైతం చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ ఫెస్టివల్‌లో పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా గాలిపటాలను ఎగరవేశారు. చిన్నారులు సైతం పతంగులకు ఎగరవేయడం చాలా ముచ్చటగా అనిపించింది. స్పైడర్ మేన్, స్నేక్స్, హల్క్స్, ఈగల్స్ రూపంలో ఉన్న పతంగులు సైతం కనువిందు చేశాయి. ఈ ఫెస్టివల్ మంగళ, బుధవారాల్లోనూ జరగనుంది. నగర వాసులు ఈ రోజుల కూడా సందడి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Related posts