మాజీ ఎంపీ మంద జగన్నాథం అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
హైదరబాద్,జనవరి 13(ప్రజాక్షేత్రం):నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం అనారోగ్య సమస్యతో ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ చంపాపేట్ లోని మాజీ ఎంపి డాక్టర్ మంద జగన్నాథం అంతిమ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ, అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యేఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభకర్, తెలంగాణ రాష్ట్ర టూరిజం & పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు మాజీ ఎంపి పోతుగంటి రాములు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బాలురాజ్, శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వడ్డేపల్లి మాజీ జెడ్పీటీసీ కాశపోగు రాజు, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ మహేష్,కోయిల్ దిన్నే శేఖర్, తనగల మహేంద్ర, బుడిదపాడు అనోక్ తదితరులు పాల్గొన్నారు.