Praja Kshetram
తెలంగాణ

నరేంద్ర మోదీ, అరవింద్, రాకేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

నరేంద్ర మోదీ,అరవింద్,రాకేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

 

నిజామాబాద్ జనవరి 14(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆలూర్ మండల కేంద్రంలో స్థానిక రైతులు బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆలూర్ బిజెపి మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ లో చేరడానికి ముందు రైతులు కోసం జగిత్యాల నుంచి నిజామాబాద్ పాదయాత్ర చేసి, రైతులను జాగృతం చేసి పసుపు రైతుల దశబ్దం కళ కోసం ఉద్యమం చేసిన మొట్టమొదటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని అన్నారు.భారతీయ జనతా పార్టీలో చేరిన తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట కోసం నరేంద్ర మోదీ తో మాట్లాడి మోదీ ద్వారా ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు ను నిజామాబాద్ లో ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగ కానుకగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని,ఇచ్చిన మాట నిలపెట్టుకున్న ధర్మపురి అరవింద్ కు ఆలూర్ మండల రైతుల పక్షాన బిజెపి నాయకుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోవడం లో ముందు ఉంటుంది అన్నారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నిక కాబడిన పల్లె గంగారెడ్డి,మండల శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.అలాగే పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించి రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి అన్నారు.ఈ కార్యక్రమం లో మండల మాజీ అధ్యక్షులు గిరీష్,రాష్ట్ర నాయకులు యాదగిరి,తౌడు మహేష్,ప్రధాన కార్యదర్శి ఎర్రం రమేష్,బీసీ మోర్చా అధ్యక్షులు నాడీశరం మల్లయ్య,యువ మొర్చ మండల అధ్యక్షులు ప్రళయతేజ్,సీనియర్ నాయకులు సుభాష్,హరీష్,బార్ల మనీష్,రమేష్,మల్లయ్య,సతీష్, మహేష్,సాయి,రవి,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts