సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు
నిజామాబాద్ జనవరి 14(ప్రజాక్షేత్రం):ఆలూర్ మండల కేంద్రంలో మంగళవారం సంక్రాంతి పండగ సందర్భంగా దేవి యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.సుమారు 30 మంది మహిళలు ముగ్గులు వేయడానికి పోటీపడ్డారు.అందులో మొదటి,రెండవ,మూడవ బహుమతులను విజేతలకు అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెమొంట్ లను అందజేశారు.ముఖ్యఅతిథిగా గ్రామ నాయకులు హాజరై వారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవి యూత్ సభ్యులు మాజీ ఎంపిటిసి మల్లేష్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల అధ్యక్షులు ముక్కెర విజయ్ మాజీ ఉప సర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్ యువకులు మహిళలు తదితరులు ఉన్నారు.