ఉద్యమకారులను ఎప్పుడు గుర్తిస్తారో
-ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి
-జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సంగీశెట్టి క్రిస్టఫర్
వలిగొండ జనవరి 14(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులను గుర్తించేది ఎప్పుడో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి సంగీశెట్టి క్రిస్టఫర్ అన్నారు. రాష్ట్రం కోసం అనేకమంది ఉద్యమకారులు ప్రాణాలను తెగించి ఉద్యమాలు చేసి పోలీసుల చేత లాఠీల దెబ్బలు తిని జైలు జీవితం గడిపి అనేకమంది నేడు అడ్డ కూలీలుగా మారారని వారిని గుర్తించి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని క్రిస్టఫర్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు మన రాష్ట్రంలో ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలం తో పాటు 25 వేల పెన్షన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని అన్నారు తెలంగాణ సాధకులుగా గుర్తింపు కార్డులను ఇవ్వాలని జేఏసీ రాష్ట్ర కార్యదర్శి క్రిస్టఫర్ అన్నారు.