గుంతపల్లి గ్రామస్తులకు మటన్ పంపిణీ చేసిన అనంత్ రెడ్డి.
కొండాపూర్ జనవరి 14(ప్రజాక్షేత్రం):సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటింటికి మేక మాంసం పంపిణీ చేసి గుంతపల్లి గ్రామస్తుల ఆశీర్వాదం తీసుకున్న టిఆర్ఎస్ యువ నాయకులు పడమటి అనంత్ రెడ్డి.ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు ఆ గ్రామంలో పుట్టడం నీ గ్రామమే కాకుండా కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్నో రకాల సేవలు చేస్తున్న అనంతరెడ్డి వృద్ధులకు చేతి కర్రలతో ప్రారంభమైన మీ సేవ గుంతపల్లి లో ప్రారంభమై కొండాపూర్ మండలం తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విస్తరించి పోయింది ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక సాయం నీ తరపున చేరింది ప్రతి గ్రామంలో రోడ్డులకి ఇరువైపులా విశ్రాంని కుర్చీలు, కరోనా సమయంలో కూరగాయల పంపిణీ, వ్యవసాయం చేసే రైతులకు పశువులు చనిపోతే వారి ఇంటి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయం. వర్షాకాలంలో గొడుగుల పంపిణీ. ప్రైమరీ స్కూల్ నుండి హైస్కూల్ కు వెళ్లే విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ దేవాలయాల నిర్మాణాలకు ఆర్ధిక సహాయం. అంబేద్కర్ శివాజీ విగ్రహాల ఏర్పాటుకు ఆర్థిక సాయం, రోగులకు చికిత్స కోసం హాస్పటల్ వద్దకే వెళ్లి ఆర్థిక సాయం కొండాపూర్ మండల కేంద్రంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటుచేసి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆటలను ప్రోత్సహించాడు. పండుగలకు అన్నదాన కార్యక్రమాలు ఆటోలు నడుపుకునే వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ, అడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, మహిళా మణులకు చీరల పంపిణీ, ఆశా వర్కర్లకు ఆర్థిక సహాయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు తన సొంత నిధులతో అనంత్ రెడ్డి సేవ చేయడం పట్ల గుంతపల్లి వాస్తవ్యులతోపాటు మండలంలోని ప్రజలు అభినందిస్తున్నారు. గురువారం గుంతపల్లి గ్రామంలో 400 కుటుంబాలకు సంక్రాంతికి 23 రకాల సరుకులను ఇంటింటికి తానే స్వయంగా తిరిగి పంపిణీ చేశారు నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇంటింటికి మటన్ టిఫిన్ డబ్బా తో సహా ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాడు. ఇలా సేవ చేయడం పుస్తకాల్లో చదివాం చరిత్రలో చూశాం కథలు చెప్తే విన్నాం. కానీ లైన్లో చూడడం కొండాపూర్ మండలం లో ఇదే మొదటిసారి మూడు పదుల వయసులో ఇలా ప్రజలకు తనకు తోచిన సాయం చేయడం ఎంతో గొప్ప విశేషమని దేవుడు అనంత్ రెడ్డికి ఆయురారోగ్యాలు కలుగజేయాలని ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలను మరిన్ని సేవలు చేయాలని గ్రామస్తులు కోరారు.