జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చిన అయ్యప్ప..
శబరి జనవరి 14(ప్రజాక్షేత్రం):శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు కనువిందు చేశాడు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మకర జ్యోతి దర్శనం సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగిపోయాయి.