వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాక్షేత్రం ముందు
-మొకిల సిఐ వీరబాబు
శంకర్ పల్లి జనవరి 15(ప్రజాక్షేత్రం):వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజాక్షేత్రం ముందుంటుందని మొకిల సిఐ వీరబాబు, గోపూలారం మాజీ సర్పంచ్ పొడుగు శ్రీనివాస్ అన్నారు. బుధవారం శంకర్ పల్లి మండలం గోపూలారం గ్రామంలోని ఎల్లమ్మ జాతరలో ప్రజాక్షేత్రం క్యాలెండర్ 2025 ను ఆవిష్కరించారు. డిజిటల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ అతి తక్కువ కాలంలో ప్రజల్లో ఎక్కువ ఆదరణ పొందింది అన్నారు. డిజిటల్ మీడియా ద్వారా కొత్త తరానికి బాటలు వేసిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాక్షేత్రం ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్, అమర్, సాయిరాజ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.