వస్తే ఇటు పోతే అటు …?
కుల్కచర్ల జనవరి 16(ప్రజాక్షేత్రం):వస్తే ఇటు పోతే అటు అన్నట్లుగా సమయపాలన పాటించకుండా పరిగి ఆర్టీసీ డిపో బస్సులు నడిపిస్తున్నారని గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గోవింద్ నాయక్ అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత పరిగి టూ మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సులు రాకపోకల సమయం లేకుండా పోయిందన్నారు. గురువారం సాయంత్రం పరిగి డిపోకు చెందిన 6 బస్సులు మహబూబ్ నగర్ నుండి పరిగివైపు ఒకదాని వెనకాలే ఒకటి వరుసగా వెళ్తున్న క్రమంలో ఆయన ఫోన్ లో వీడియోలను రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉదయం, సాయంకాల సమయాలలో మండల కేంద్రాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విద్యార్థుల భవిష్యత్తును ప్రజలలను దృష్టిలో పెట్టుకుని పరిగి ఆర్టీసీ అధికారులు సమయనికి అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు.