రేషన్ కార్డుల సర్వేను వేగవంతంగా పూర్తి చేస్తాం: పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్
నిజామాబాద్, జనవరి 17(ప్రజాక్షేత్రం):ఆలూరు మండల పరిధిలోని దేగాం గ్రామంలో కొత్త రేషన్ కార్డుల సర్వేను శుక్రవారం సెక్రెటరీ శ్రీనివాస్ నిర్వహించారు.అలాగే ఆలూర్ మండలం రామచంద్రపల్లి గ్రామంలో ఇంచార్జ్ సుభాష్ సర్వే ను చేపట్టారు.ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారుల సర్వే ను చేపట్టారు.ఈనెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేగాం,రామచంద్రపల్లి గ్రామాలలో రేషన్ కార్డుల సర్వేను తొందర్లోనే ముగుస్తుందని పేర్కొన్నారు.