మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
-శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు
శంకర్ పల్లి జనవరి 19(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పైన భౌతికంగా, వ్యక్తిగతంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తి పై చర్యలు తీసుకోవాలని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వరంలో పిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్లు మద్దిలేటి మాదిగ, గట్టగల్ల ప్రశాంత్ మాదిగ, రంగారెడ్డి జిల్లా నాయకులు కాస్యారం శంకర్ రావు మాదిగ లు మాట్లాడుతూ…. మందకృష్ణ మాదిగ పైన భౌతిక దాడులు చేసి కొట్టి చంపమని ప్రజలను రెచ్చగొడుతూ సంఘ విద్రోహ శక్తులలాగా మాల మహానాడు నాయకుడు మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని, ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన వారిని ఈ దేశం నుండి బహిష్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, మేధావులను, ప్రజాస్వామ్య వాదులను తప్పుబడుతూ మాట్లాడడంపై చట్టపరమైన కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను కోరడం జరిగింది. ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలా రెచ్చగొడుతూ ఉన్మాదంతో మాట్లాడే వారిని సభ్య సమాజం గమనిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్, ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాని భాను ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు వన్నెపాగ వంశీ మాదిగ, మండల అధ్యక్షులు బడ్లగూడెం శ్రీనివాస్, సీనియర్ నాయకులు లక్ష్మయ్య, నర్సింలు, రాంచందర్, యాదయ్య, భిక్షపతి, గొట్టయ్య, నర్సింలు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.