ఈ దరఖాస్తు ఫారం నింపితే రేషన్ కార్డు మీ ఇంటికే..!!
-రేషన్ కార్డు కొరకు మరో కొత్త దరఖాస్తు
హైదరాబాద్ జనవరి 19(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల మంజురుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 26 నుండి నూతన రేషన్ కార్డులను అందజేయనున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎంతో కాలంగా లక్షలాది కుటుంబాలు ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకు గాను మంత్రివర్గం ఉప సంఘం సిఫారసుకు అనుగుణంగా లబ్దిదారుల ఎంపిక చేయనుంది. నూతన రేషన్ కార్డుల దరఖాస్తులు, కుటుంబ సర్వే ఆధారంగా జిల్లా కలెక్టర్,జిహెచ్ఎంసి కమిషనర్ లకు జాబితాను పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపిడిఓ, యుఎల్బి లో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. అర్హత కల్గిన కుటుంబాలకు ఈ నెల 26 నుండి నూతన రేషన్ కార్డులను అందజేనున్నారు. దరఖాస్తు ఫారాలు మీ సేవ కేంద్రాల్లో లేదా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని సూచిస్తున్నారు. మీ సేవ సర్వీస్ ఫారంల పై క్లిక్ చేస్తే ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. ఫారం డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుదారుని పేరు, వయస్సు, లింగం, తండ్రి పేరు, చిరునామా, కుటుంబ ఆదాయం పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం పూర్తి చేసి దరఖాస్తు ఫారంను నిర్నీత రుసుముతో మీ సేవ కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తుదారుడి ఫోటో, దృవీకరణ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్, అవసరం ఉంటుంది.