Praja Kshetram
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు లబ్ధి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు లబ్ధి

 

 

-రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

 

కాగజ్‌నగర్‌, జనవరి 19(ప్రజాక్షేత్రం):బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు ఎంతగానో లబ్ధి జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని మానిక్‌పటార్‌ గ్రామంలో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ మానిక్‌పటార్‌ గ్రామం 1950నుంచి గుర్తించబడిందన్నారు. 70 ఏళ్లుగా నివసిస్తున్నా ఇక్కడి ప్రజలకు కనీసం ఇళ్లు, రోడ్డు సౌకర్యం లేదన్నారు. ప్రస్తుతం ఈ గ్రామాన్ని టైగర్‌ రిజర్వు ప్రాంతంగా పరిగణిస్తూ తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులకు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా వారిని తీసివేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే సమస్యలపై పట్టించుకోవటం లేదన్నారు. అనంతరం గిరిజనుతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. అంతకుముందు ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్‌ లెండు గురే శ్యాంరావు, కోకన్వీనర్‌ రాం ప్రసాద్‌, యూత్‌కన్వీనర్‌ కావుపాక రాజు, మండల కన్వీనర్‌ ఆవుల రాజ్‌కుమార్‌, నవీన్‌, షేక్‌ చాంద్‌, అస్లాం బండి, బండి వాసు, గ్రామ పెద్దలు మురళి పటేల్‌ మహిళలు ఉన్నారు.

Related posts