Praja Kshetram
తెలంగాణ

సింగపూర్‌తో తెలంగాణ సర్కార్‌ మరో భారీ ఎంవోయూ

సింగపూర్‌తో తెలంగాణ సర్కార్‌ మరో భారీ ఎంవోయూ

 

-రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్క్‌ ఏర్పాటుకు నిర్ణయం.

-హైదరాబాద్‌ను బిజినెస్‌ క్యాపిటల్‌ చేసేందుకు కృషి.

హైదరాబాద్ జనవరి 19(ప్రజాక్షేత్రం):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సీఎం సింగపూర్ పర్యటనలో మరో ముందడుగు పడింది. సింగపూర్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్, హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయిగా అభివర్ణించారు. రాబోయే ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోని క్యాపిటాల్యాండ్ విస్తృత అభివృద్ధి భాగం. ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రీమియం సౌకర్యాలను కోరుకునే గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి), బ్లూ-చిప్ కంపెనీల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదని పేర్కొంది. క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ సిఇవో గౌరీ శంకర్ నాగభూషణం ఇలా అన్నారు. “హైదరాబాద్‌లో మా కంపెనీని విస్తరించేందుకు మేము సంతోషిస్తున్నాము, స్థిరమైన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడానికి దాని శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాము.” అని పేర్కొన్నారు. క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ పేర్లతో మూడు ప్రముఖ వ్యాపార పార్కులను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ గతంలో ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ 2025 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ఐటీపీహెచ్)లో రెండో దశ రీడెవలప్‌మెంట్ ఈ సంవత్సరం ప్రారంభం కానుంది, 2028 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో క్యాపిటల్ ల్యాండ్ పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

Related posts